: మాజీ మావోయిస్టు పోస్టర్ ను ఆవిష్కరించిన కోదండరామ్


తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్... గత కొంత కాలం నుంచి మళ్లీ యాక్టివ్ అయ్యారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో, నేడు మాజీ మావోయిస్టు కూనపురి రాములు ప్రథమ వర్ధంతి వేడుకల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోదండరామ్ నివాసంలో జరిగింది. ఈ నెల 11వ తేదీన నల్గొండ జిల్లా దాసిరెడ్డిగూడెంలో రాములు వర్ధంతి వేడుకలు జరగనున్నాయి. అదే రోజున స్థూపాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.

  • Loading...

More Telugu News