: 10టీవీ న్యూస్ చానల్ సిబ్బందికి షాకిచ్చిన దొంగలు


తెలుగు వార్తా చానళ్లలో ఒకటైన 10టీవీకి చోరాగ్రేశులు షాక్ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను కవర్ చేయడానికి ఈ ఉదయం 10టీవీ సిబ్బంది హైదరాబాదులోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)కు వెళ్లారు. ఈ సందర్భంలో, సమయం చూసుకుని చానల్ కు చెందిన త్రీజీ కిట్ ను దొంగలు పట్టుకుపోయారు. విషయం గ్రహించిన చానల్ సిబ్బంది అవాక్కయ్యారు. జరిగిందేదో జరిగింది... దొంగలను గుర్తించేందుకు బస్ స్టేషన్లలో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని చూద్దామనుకుంటే... ఆ కెమెరాలకు బ్యాకప్ లేకపోవడంతో, రికార్డు కాలేదు. దీంతో చేసేదేమీ లేక సదరు చానల్ సిబ్బంది ఆఫీసుకు బయల్దేరారు.

  • Loading...

More Telugu News