: ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ విమర్శలు సరికాదు: వెంకయ్యనాయుడు


ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేయడం, పలువురు వ్యాఖ్యానించడాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండిస్తున్నారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రత్యేక హోదా కీలక అంశమని, దాన్ని అడిగే హక్కు ప్రజలకే ఉందని, పార్టీలకు లేదని పేర్కొన్నారు. అప్పుడే యూపీఏ ప్రభుత్వం హోదాకు చట్టబద్ధత కల్పించి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అయినా ఆ విషయంపై విస్తృత స్థాయిలో చర్చిస్తున్నామన్నారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని, ఏపీ ఆర్థిక లోటుపై ఆర్థిక, హోంశాఖలు చర్చిస్తున్నాయని చెప్పారు. అంతేగాక హైకోర్టు విభజనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News