: రజనీకాంత్ మరోమారు తాత అయ్యాడు... మగబిడ్డకు జన్మనిచ్చిన చిన్న కూతురు సౌందర్య
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోమారు తాత అయ్యాడు. రజనీకాంత్ చిన్న కూతురు, 'కొచ్చడయాన్' దర్శకురాలు సౌందర్య నిన్న రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్ కుమార్ ను నాలుగేళ్ల క్రితం సౌందర్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రసవానంతరం తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. తమిళ హీరో ధనుశ్ ను పెళ్లి చేసుకున్న రజనీ పెద్ద కూతురు ఐశ్వర్యకు ఇప్పటికే ఇద్దరు కుమారులున్నారు. తాజాగా సౌందర్య కూడా మగబిడ్డకు జన్మనివ్వడంతో రజనీకాంత్ ముచ్చటగా మూడో మనవడికి తాత అయ్యాడు.