: జైలులో సత్యం రామలింగరాజు నుంచి సెల్ ఫోన్ స్వాధీనం
చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ సత్యం రామలింగరాజు నుంచి జైలు అధికారులు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదయం ఆయన ఉంటున్న గోదావరి బ్యారక్ లో జైళ్లశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలోనే ఒక సెల్ ఫోన్, రెండు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అవి జైలులోకి ఎలా వచ్చాయన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.