: '@OfficeOfRG' అంటూ, ట్విట్టర్ లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. దీంతో సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించి అభిప్రాయాలు పంచుకోవడం లేదని ఆయనపై వస్తున్న విమర్శలకు తెరపడినట్లయింది. ట్విట్టర్లో ఆయన తన ఖాతాకు '@OfficeOfRG' అని పేరు పెట్టారు. ఆయన ఖాతాను ప్రారంభించగానే, నిమిషాల వ్యవధిలో 7 వేల మంది వరకూ ఫాలో అవుతామంటూ రిక్వెస్ట్ లు పంపారు. కాంగ్రెస్ నేతృత్వంలో నడుస్తున్న యువజన సంఘం ఎన్ఎస్ యూఐ ఆయన్ను ఫాలో అవ్వాలని నిర్ణయించింది. సుమారు 57 రోజుల సెలవు అనంతరం తిరిగొచ్చిన రాహుల్, రెట్టించిన ఉత్సాహంతో మోదీ సర్కారుపై విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.