: బస్సులను బయటకు తీస్తున్న యాజమాన్యం... అడ్డుకుంటున్న కార్మికులు


ఆర్టీసీ సమ్మెలో భాగంగా నేటి ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ఆర్టీసీ అధికారులు తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకున్న సిబ్బంది చేత బస్సులను డిపోల నుంచి బయటకు తీస్తున్నారు. అయితే తమను కాదని తాత్కాలిక కార్మికుల చేత బస్సులను ఎలా తిప్పుతారని నిలదీస్తున్న కార్మికులు బస్సులను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక సిబ్బంది, ఆర్టీసీ కార్మికుల మధ్య పలుచోట్ల వాగ్వివాదం చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో ఇరువర్గాలు గల్లాలు పట్టుకున్నాయి. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో గుంటూరు జిల్లా తెనాలి, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం, నిజామాబాదుల్లో ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News