: అరుదైన రికార్డు దిశగా ‘అమరరాజా’...ఏడాదిలోగా బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరణ
_2663.jpg)
బ్యాటరీల తయారీలో దేశీయంగానే కాక అంతర్జాతీయంగానూ ప్రఖ్యాతి గాంచిన అమరరాజా బ్యాటరీస్ ఈ ఏడాది సరికొత్త రికార్డును సృష్టించనుంది. బిలియన్ డాలర్ల కంపెనీగా తమ సంస్థ అవతరించబోతోందని అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని యాదమరి మండలంలో 500 ఎకరాల్లో ఆ కంపెనీ ఏర్పాటు చేసిన అమరరాజా గ్రోత్ కారిడార్ ను నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రామచంద్రనాయుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ 500 ఎకరాల గ్రోత్ కారిడార్ లో 150 ఎకరాలను తాము వినియోగించుకోనున్నామని, మిగతా భూమిని అభివృద్ధి చేసి ఇతర కంపెనీలకు అందివ్వనున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ వ్యాపార పరిమాణం రూ.5,600 కోట్లు దాటిందని, తాజాగా గ్రోత్ కారిడార్ తో రూ.6,300 కోట్ల మార్కును అందుకోనున్నామని ఆయన తెలిపారు.