: వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు
క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వచ్చే 24 గంటలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో భారీ వర్షం కురిసింది. ఇక్కడ 6 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అలాగే, కాళ్లలో 6 సెంటీమీటర్లు, ఆకివీడులో 4.6, చింతలపూడిలో 4, టి.నర్సాపురంలో 3.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులకు పలు ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అరటి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది.