: మోదీ పాలన గురించి ప్రజలు చెబుతారు... స్లోగన్స్ కాదు: అఖిలేశ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన గురించి ప్రజలే చెబుతారని, నినాదాలు పనిచేయవని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. కపిలవస్తులోని సిద్ధార్థ్ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... మోదీ తన ఏడాది పాలనలో ఏం చేశారన్న విషయం ప్రజలు పరిశీలిస్తారని, వారే అంచనా వేస్తారని వివరించారు. పనితీరును బట్టే ప్రజల మద్దతు ఆధారపడి ఉంటుందని తెలిపారు. మోదీ ఏడాది పాలనపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం అఖిలేశ్ పైవిధంగా జవాబిచ్చారు.