: సెంచరీతో గేల్ వీరవిహారం... డివిలియర్స్ ఊచకోత


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ వీరవిహారం చేశాడు. కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 11 సిక్సుల సాయంతో సెంచరీ సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టు ఆది నుంచే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. బౌలర్ సందీప్ శర్మ, జాన్సన్, మ్యాక్స్ వెల్, అక్షర్ పటేల్, కరణ్ వీర్ సింగ్ అని తేడా లేకుండా ఉతికేశారు. గేల్ వీరవిహారంతో పంజాబ్ బౌలర్ల ఎకానమీ అమాంతం పెరిగిపోయింది. కోహ్లీ (32)ని సందీప్ శర్మ అవుట్ చేయడంతో కాస్త నెమ్మదిస్తాడని పంజాబ్ బౌలర్ల ఆశలు అడియాసలు చేస్తూ గేల్ విరుచుకుపడ్డాడు. అతనికి జత కలిసిన డివిలియర్స్ పంజాబ్ బౌలర్లు సంధించిన బంతులను ఊచకోతకోశాడు. అనురీత్ సింగ్ వేసిన 15వ ఓవర్లో డివిలియర్స్ వరుసగా మూడు సిక్సులు కొట్టి తన ఉద్దేశ్యం చెప్పాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోయిన బెంగళూరు 179 పరుగులు చేయగా, గేల్ (107), డివిలియర్స్ (31) క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News