: జనం అదే మాట అంటున్నారు: జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత మొదలైందని అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఆయన ప్రసంగిస్తూ... చంద్రబాబు పాలనపై ఏడాది తిరగకముందే విముఖత వ్యక్తమవుతోందని తెలిపారు. ఈ సీఎం వద్దంటే వద్దని ప్రజలు అంటున్నారని, రాష్ట్ర నలుమూలలా జనం అదే మాట అంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని, ఆ రోజు మరెంతో దూరంలో లేదని అన్నారు. చంద్రబాబు రాగానే రాష్ట్రంలో కష్టాలు మొదలయ్యాయని, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని, ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారని విమర్శించారు.