: గేల్ సునామీ... నాలుగోవర్లు 51 పరుగులు
ఐపీఎల్ సీజన్-8లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 40వ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ జార్జ్ బెయిలీ ఫీల్డింగ్ ఎంచుకోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది. చావో రేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు విజయం కోసం ప్రయత్నిస్తుండగా, పంజాబ్ బౌలర్లపై గేల్ విరుచుకుపడుతున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన గేల్ కేవలం 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సుల సాయంతో 46 పరుగులు చేశాడు. మరోవైపు కోహ్లీ 9 బంతుల్లో ఒక ఫోర్ తో 8 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు నాలుగు ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 51 పరుగులు చేసింది.