: భూములు ఇవ్వకపోతే ప్రాజెక్టులు ఎలా వస్తాయ్?: రైతులను ప్రశ్నించిన చంద్రబాబు


విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రాజెక్టులకు భూములు అవసరమని, భూములు ఇవ్వకుంటే ప్రాజెక్టులు ఎలా వస్తాయని రైతులను ప్రశ్నించారు. భూములిచ్చే రైతులకు పూర్తి స్థాయిలో ప్యాకేజి అందజేస్తామని స్పష్టం చేశారు. ఇక, తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని పురోభివృద్ధికి అన్వయించి చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి తనకు రెండు కళ్లలాంటివని అభివర్ణించారు. దక్షిణ భారతదేశంలోకెల్లా మన రాష్ట్రంలోనే నీటి వనరులు అధికంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగపర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, మృణాళిని, అచ్చెన్నాయుడు తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News