: పట్టపగలు నడిరోడ్డు మీద నవ వధువు హత్య


పెళ్లైన వారం రోజులకే ఓ యువతి పట్టపగలు, నడి రోడ్డు మీద హత్యకు గురికావడం మహారాష్ట్రలోని థానేలో సంచలనం రేపింది. థానే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... థానేలోని వాంగ్లే ఎస్టేట్ ప్రాంతానికి చెందిన ప్రియాంక ప్రమోద్ ఖరాడే అనే మహిళను నడిరోడ్డుపై గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి పరారయ్యారు. థానేలోని అత్యంత రద్దీగా ఉండే ఎంఐడీసీ భవనం వద్ద ఫుట్ పాత్ పై నిలబడి ఉండగా, ఈ దారుణం చోటుచేసుకుంది. కిసాన్ నగర్ లోని పుట్టింటికి వెళ్తుండగా, ఆమె హత్యకు గురికావడం విశేషం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News