: రాముడు పాకిస్థాన్ లో పుట్టాడా?


ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు రహీం ఖురేషి కొత్త వివాదానికి తెరదీశారు. రామ జన్మభూమి అయోధ్య కాదని, రాముడు పాకిస్థాన్ లో పుట్టాడని కొత్త వాదన లేవనెత్తారు. తన పుస్తకం 'అయోధ్య కా తనాజా' (అయోధ్య వివాదం) విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్కియాలజిస్టు జస్సూ రామ్ పరిశోధన పత్రాన్ని కూడా తన పుస్తకంలో పొందుపరిచానని ఖురేషి తెలిపారు. అందులో, రామ జన్మభూమి అయోధ్య కాదన్న విషయం స్పష్టంగా చెప్పారని, రాముడు పుట్టింది పాక్ లోనే అని, ఆయన జన్మభూమిని ఇంతకుముందు రామ్ దేరి అనేవాళ్లని వివరించారు. దేశ విభజన తర్వాత దాని పేరు రహ్మాన్ దేరిగా మార్చారని తెలిపారు. నిజమైన రామ జన్మభూమి అదేనని, అది పాక్ లోని హరప్పా ప్రాంతంలో ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News