: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి: ఎన్నారైలకు లోకేష్ పిలుపు
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. తయారీ రంగ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను మలిచే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో డైనమిక్ గ్లాస్ తయారీ కేంద్రం స్థాపించాలని ఆ సంస్థ సీఈవో డాక్టర్ రావు ముల్పూరిని కోరారు. ఇమేజినేషన్ ప్రెసిడెంట్ కృష్ణ యార్లగడ్డను కలుసుకుని విశాఖపట్టణంలో డెవెలెప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐటీ, ఐటీఈఎస్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన పలువురు పెట్టుబడిదారులతో ఆయన సమావేశమై ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు.