: పది రూపాయల కోసం పెళ్లాన్ని చంపేశాడు
డబ్బు మా చెడ్డదని సినీ రచయిత అన్నట్టు...పది రూపాయలు నిండు ప్రాణం తీశాయి. పశ్చిమ ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అశోక్ (61) అనే వ్యక్తి తన భార్య రాణి (42)ని పది రూపాయలు ఇవ్వమని అడిగాడు. ఆమె అందుకు నిరాకరించింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. అది చిలికి చిలికి గాలివానగా మారడంతో కోపోద్రిక్తుడైన అశోక్ వంటింట్లోంచి కత్తిని తెచ్చి ఆమెను పొడిచి చంపాడు. రక్తపు మడుగులో శవమైపడి ఉన్న ఆమెను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.