: చిన్న స్ఫూర్తి కలిగిస్తే ఇక రగిలిపోతారు: కేసీఆర్
'స్వచ్ఛ హైదరాబాద్' ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తనదైన శైలిలో మాట్లాడారు. పేద ప్రజల్లో కొంచెం స్ఫూర్తి కలిగిస్తే చాలని, ఇక రగిలిపోతారని అన్నారు. పేదలు కూడా తలెత్తుకుని జీవించాలన్నది తన ఆకాంక్ష అని తెలిపారు. ఇటీవల తాను ఐడీహెచ్ కాలనీకి వెళ్లగా, అక్కడి ప్రజల కళ్లల్లో కోటి రూపాయల ఆనందం కనిపించిందని చెప్పుకొచ్చారు. నగరంలోని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని పునరుద్ఘాటించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరలోనే అర్హులకు అందజేస్తామని తెలిపారు.