: తిరుమలలో నాగార్జున చేయందుకుని ముద్దుపెట్టిన మహిళ


టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తిరుమల విచ్చేశారు. సంప్రదాయ దుస్తుల్లో స్వామి వారి దర్శనానికి వచ్చారు. నాగ్ ను చూసేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. ఇంతలో ఓ మహిళ నాగార్జున చేయందుకుని ముద్దు పెట్టి మురిసిపోయింది. కాగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు టీటీడీ బోర్డులో చోటు దక్కడం పట్ల నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావును అభినందించారు. శ్రీవారిపై భక్తి మెండుగా ఉన్న వ్యక్తి రాఘవేంద్రరావు అని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి తనపైనా కటాక్షం చూపి టీటీడీ బోర్డులో చోటు కల్పిస్తే తప్పక స్వీకరిస్తానని అన్నారు.

  • Loading...

More Telugu News