: సల్మాన్ ఖాన్ కు బెయిల్ కోసం రంగంలోకి దిగిన హరీష్ సాల్వే
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు బెయిల్ కోసం ప్రముఖ సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే రంగంలోకి దిగారు. ఈ మధ్యాహ్నం బాంబే హైకోర్టుకు చేరుకున్న ఆయన సల్మాన్ తరపున వకాల్తా పుచ్చుకొని పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయనకు సెషన్స్ కోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులు కేసు గురించిన వివరాలు తెలిపారు.