: ఆ పరిస్థితుల్లో భర్తని చంపడం తప్పుకాదు: ఢిల్లీ న్యాయస్థానం


కన్న కూతురుపై తండ్రి అఘాయిత్యానికి ఒడిగట్టడంతో ఆగ్రహించి భర్తను చంపిన మహిళ నిర్దోషి అని పేర్కొంటూ ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుదేశ్ కుమార్ తీర్పునిస్తూ... ఆత్మరక్షణలో భాగంగా కన్నబిడ్డపై జరిగే అఘాయిత్యాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భర్తని హత్యచేయడం తప్పుకాదని పేర్కొన్నారు. ఈ సంఘటనపై నిందితురాలు మాట్లాడుతూ, గతంలో ఇలాంటి దారుణానికి ప్రయత్నించినప్పుడు అడ్డుకున్నందుకు కూతురి కాలు విరగ్గొట్టాడని, ఇలాంటి కామాంధుడ్ని అంతమొందించకపోతే తమ ప్రాణాలు పోయేవని చెప్పింది. ఇదే స్థాయిలో తన వాదనలు వినిపించింది. దీంతో కేసు పూర్వాపరాలు విన్న న్యాయమూర్తి ఆమె చేసిన పనిని సమర్థించారు.

  • Loading...

More Telugu News