: ఫుట్ పాత్ పై ప్రమాదం జరిగితే తప్పు డ్రైవర్లదా?: బాలీవుడ్ సింగర్ అభిజిత్


సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష నేపథ్యంలో బాలీవుడ్ స్పందించింది. గాయకుడు అభిజిత్ వింత వాదన వినిపించారు. ఫుట్ పాత్ లు ఉన్నది నిద్రపోయేందుకు కాదని, ఫుట్ పాత్ లపై ప్రమాదాలు జరిగితే డ్రైవర్లది తప్పెలా అవుతుందని అన్నారు. ఫుట్ పాత్ ప్రమాద ఘటనలకు మద్యాన్ని కూడా కారణంగా చూపలేమని అభిప్రాయపడ్డారు. అటు, డిజైనర్ ఫరా అలీ ఖాన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వెల్లడించారు. పేదలను నిరాశ్రయులను చేస్తున్నది ప్రభుత్వమేనని, అందుకే వారు ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్నారని పేర్కొన్నారు. ఫుట్ పాత్ పై నిరాశ్రయులు పడుకోకుండా ఉంటే వారికి ప్రమాదం తప్పి ఉండేదని అన్నారు. అప్పుడు సల్మాన్ కారు ఎక్కించినా నష్టం వాటిల్లేది కాదని అభిప్రాయపడ్డారు. అందుకే, 'హిట్ అండ్ రన్' కు ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

  • Loading...

More Telugu News