: నేపాల్ కు భారత్ సాయం వెలకట్టలేనిది: ఐరాస


భూకంపం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్ కు భారత్ అన్నివిధాలా సాయం చేస్తోంది. శిథిలాల తొలగింపునకు అవసరమైన యంత్రాలు, ఔషధాలు, వైద్య సేవలు... ఇలా తన శక్తిమేర సాయపడుతోంది. ఈ క్రమంలో, మున్ముందు కూడా నేపాల్ కు అండగా ఉంటామని, పునర్నిర్మాణంలో తోడ్పాటునందిస్తామని భారత్ తాజాగా ఐక్యరాజ్యసమితికి తెలిపింది. దీనిపై ఐరాస అధికారి భగవంత్ బిష్ణోయి మాట్లాడుతూ... భారత్ నిర్ణయాన్ని కొనియాడారు. నేపాల్ కు భారత్ చేసిన సాయం అమూల్యమని అన్నారు. ఆ సాయాన్ని కొనసాగిస్తామని చెప్పడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఆపరేషన్ మైత్రి పేరిట భారత్ నేపాల్ కు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News