: మళ్లీ డ్యూటీలో సూర్యాపేట సీఐ!
సిమీ ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సూర్యాపేట సీఐ మొగలయ్య పూర్తిగా కోలుకున్నారు. దాంతో తిరిగి ఈ రోజు ఆయన విధుల్లో చేరారు. గత నెలలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సూర్యాపేట బస్టాండ్ లో జరిగిన కాల్పుల్లో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఘటనలో కానిస్టేబుల్ నాగరాజుతో పాటు ఓ హోంగార్డు కూడా మరణించాడు. మొగలయ్య తిరిగి విధుల్లో చేరడం పట్ల స్టేషన్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.