: కుప్పకూలిన ఏరోస్ షేర్లు... సల్మాన్ తో సినిమా నిర్మిస్తున్నందునే!


బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల శిక్ష పడిందని తెలియగానే ఆయనపై చిత్రాలు నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఏరోస్ ఇంటర్నేషనల్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో కుప్పకూలాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఏరోస్ ఈక్విటీ విలువ క్రితం ముగింపు రూ. 405తో పోలిస్తే, 5 శాతానికి పైగా దిగజారి రూ. 382 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు తీర్పు వెలువడిన తరవాత సంస్థ ఈక్విటీ 9 శాతం వరకూ నష్టపోయినప్పటికీ, ఆపై కాస్తంత తేరుకుంది. ఏరోస్ తో పాటు సల్మాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్ బీయింగ్ హ్యూమన్ తో డీల్ కుదుర్చుకున్న మంధనా ఇండస్ట్రీస్ ఈక్విటీ కూడా తీవ్ర ఒత్తిడికి లోనయింది. పలువురు ఇన్వెస్టర్లు మంధనా ఈక్విటీల అమ్మకాలు వెల్లువెత్తడంతో 5 శాతం వరకూ నష్టపోయింది.

  • Loading...

More Telugu News