: మా కుటుంబం ఒంటరి కాదని ఈరోజు అర్థమైంది: సల్మాన్ సోదరి అర్పిత


సోదరుడు సల్మాన్ ఖాన్ కు జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన సోదరి అర్పిత స్పందించారు. ఈ కష్టకాలంలో సల్మాన్ కు ఫ్యాన్స్ ఎంతో మద్దతుగా నిలిచారని తెలిపారు. అభిమానుల స్పందన చూసిన తర్వాత, తమ కుటుంబం ఒంటరి కాదన్న విషయం తెలిసిందని పేర్కొన్నారు. తమ పట్ల అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో స్పందించారు.

  • Loading...

More Telugu News