: బెయిల్ కోసం హైకోర్టుకు వెళతాం: సల్మాన్ న్యాయవాది


హిట్ అండ్ రన్ కేసులో నటుడు సల్మాన్ ఖాన్ కు విధించిన ఐదేళ్ల జైలు శిక్షపై బాంబే హైకోర్టుకు వెళతామని న్యాయవాది శ్రీకాంత్ శివడే చెప్పారు. తీర్పు కాపీ అందాకే అప్పీలుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బాంబే హైకోర్టు ప్రస్తుతం వేసవి వెకేషన్ లో ఉన్నందున వెకేషన్ బెంచ్ సల్మాన్ పిటిషన్ ను పరిశీలించే అవకాశం ఉంది. ఈ కేసులో సల్మాన్ ఐదేళ్ల జైలు శిక్షతో పాటు... డ్రైవింగ్ లైసెన్స్ లేనందున మరో 2 నెలల జైలు శిక్షను కూడా గడపాల్సి ఉంది. దాంతోపాటు రూ.500 జరిమానాను కూడా కోర్టు విధించింది.

  • Loading...

More Telugu News