: ప్రత్యేక హోదా ఆందోళనలను సమర్థించిన చంద్రబాబు


ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలను జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలను తాను సమర్థిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్ర ఇప్పటికే కొన్ని విషయాల్లో చొరవ తీసుకుందని, కేంద్రం సహకరిస్తుందని, అయినా తాము ఒత్తిడి తెస్తున్నామని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మండలం నర్సిపురంలోని చెరువులో చంద్రబాబు జేసీబీని నడిపి, పూడికతీత పనులను ప్రారంభించారు. అనంతరం 3 కిలోమీటర్ల దూరం పూడికమట్టి ట్రాక్టర్ ను నడిపారు. తరువాత జరిగిన సభలో సీఎం పైవిధంగా మాట్లాడారు. ఉపాధి లేక విజయనగరం ప్రజలు వలస పోతున్నారని, వలసల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News