: మొన్న మున్నాభాయ్, నేడు సల్లూభాయ్... తమ నేర ప్రవృత్తితో కటకటాల్లోకి!


వారిద్దరూ బాలీవుడ్ అగ్రహీరోలే, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో తిష్ట వేసుకుని కూర్చున్నవారే. అయితేనేం, తమ నేర ప్రవృత్తితో విలన్లయ్యారు. కోర్టు తీర్పులతో కటకటాల వెనక్కు వెళ్లి బంధుమిత్రులకు, అభిమానులకు ఆవేదన కలిగించారు. వారే సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ లు. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా, ఆక్రమ ఆయుధాలు కలిగివున్నాడన్న ఆరోపణలపై తనకు పడ్డ ఐదేళ్ల శిక్షను సంజయ్ పూణెలోని ఎరవాడ జైలులో అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, కండల వీరుడిగా, బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా గుర్తింపున్న సల్మాన్ ఖాన్ కూడా తన విపరీత ధోరణులతో కేసుల్లో ఇరుక్కున్నాడు. 2002 నాటి 'హిట్ అండ్ రన్' కేసుతో పాటు, జోథ్ పూర్ సమీపంలో కృష్ణ జింకల వేట కేసు ఆయన్ను వెంటాడాయి. నేడు సల్మాన్ కు శిక్ష ఖరారు కావడంతో పోలీసులు ఆర్థర్ రోడ్ లోని జైలుకు తరలించనున్నారు. కాగా, ఇదే సమయంలో చట్టం ముందు అందరూ సమానమేనన్న భావాన్ని సామాన్యుల్లో పెంచేందుకు ఈ కేసులు దోహదపడ్డాయనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News