: సల్లూ భాయ్ కి శిక్షపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు హిట్ అండ్ రన్ కేసులో శిక్షపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరిగిందని, ఇప్పటికైనా కోర్టు విచారణ ముగించిందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. అదే సమయంలో తప్పు చేసిన సల్మాన్ ఖాన్ కు 13 ఏళ్ల తర్వాతైనా శిక్ష పడటం హర్షించదగ్గ విషయమని ఈ వర్గం నెజిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే, మరో వర్గానికి చెందిన నెటిజన్లు మాత్రం సల్మాన్ ఖాన్ పెద్ద తప్పేమీ చేయలేదని, ఆ మాత్రానికే అతడికి శిక్ష విధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటి హేమామాలిని కూడా ఈ కోవకు చెందిన నెటిజన్ల వాదనతో ఏకీభవించారు. సల్మాన్ కు తక్కువ శిక్ష పడాలని ఆమె ఆకాంక్షించారు. ఇక మరో నటి బిపాసా బసు కూడా సల్మాన్ కు మద్దతుగా నిలిచింది. సల్మాన్ చాలా మంచి మనిషి, అతడికి అందరూ అండగా నిలవాలని కోరింది.

  • Loading...

More Telugu News