: ఓ పద్ధతి ప్రకారం దేశాన్ని దిగజారుస్తున్న మోదీ: పార్లమెంటులో విరుచుకుపడ్డ సోనియా
అన్ని విషయాల్లోనూ కార్పొరేట్లకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకుంటూ, మోదీ సర్కారు ఒక పద్ధతి ప్రకారం దేశాన్ని దిగజారుస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఈ ఉదయం పార్లమెంటులో ఆమె ప్రసంగిస్తూ, సంస్థాగత యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ప్రజల చేతుల్లో బలమైన ఆయుధంగా ఉన్న స.హ చట్టాన్ని బలహీనపరుస్తున్నారని దుయ్యబట్టారు. ఈ చట్టం కింద 39 వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని అన్నారు. వీటికి సమాధానాలు ఎప్పుడిస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. సుపరిపాలనను, పారదర్శకతను తీసుకువస్తానని హామీలిచ్చిన మోదీ ఆ రెండింటికీ ఆమడ దూరం జరిగిపోయారని విమర్శించారు. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పోస్టు గత 8 నెలలుగా ఖాళీగా ఉందని, లోక్ పాల్ కు సీవీసీ నియామకమూ జరగలేదని గుర్తు చేసిన ఆమె, ఖాళీగా ఉన్న కీలక పోస్టులను తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.