: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వెనక్కి తగ్గలేదు: సుజనా చౌదరి


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము ప్రయత్నిస్తూనే ఉన్నామని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో సుజనా, మరో ఎంపీ సీఎం రమేష్ వెళుతున్న కారులను జేఏసీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం పార్లమెంట్ లో పోరాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నినాదాలు చేశారు. దాంతో కారు దిగిన వారిద్దరూ విద్యార్థులతో మాట్లాడారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందో లేదో తెలియదని, తమ ప్రయత్నాలు మాత్రం ఆపలేదని సుజనా పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజలు తమను అర్ధం చేసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News