: హీరో శివాజీ దీక్ష భగ్నం... అరెస్ట్ చేసిన పోలీసులు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న టాలీవుడ్ నటుడు, బీజేపీ నేత శివాజీ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కొద్దిసేపటి క్రితం దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టిన పోలీసులు శివాజీని అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, శివాజీ మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు శివాజీ మద్దతుదారులను తోసివేసి, ఆయనను అంబులెన్స్ ఎక్కించారు. దీంతో శివాజీ దీక్ష ముగిసినట్లైంది. నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న నేపథ్యంలో శివాజీ ఆరోగ్య పరిస్థితి నేటి ఉదయం మరింత క్షీణించింది. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయిన శివాజీ ఏకంగా ఏడు కిలోల బరువు తగ్గారు. వైద్యుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు శివాజీ దీక్షను భగ్నం చేశారు.