: పొన్నూరులో పోకిరీల ఆగడాలు... ఇంటర్ విద్యార్థిని సైకిల్ ను బైక్ తో ఢీ కొట్టారు!


గుంటూరు జిల్లా పొన్నూరులో పోకిరీల ఆగడాలతో కళాశాలలకు వెళ్లే అమ్మాయిలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేధింపులతో సతాయించే పోకిరీలు, తాజాగా కొద్దిసేపటి క్రితం మరింత రెచ్చిపోయారు. కళాశాలకు సైకిల్ పై వెళుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థినిని ఓ పోకిరీ ముఠా బైక్ తో ఢీ కొట్టింది. దాంతో కింద పడ్డ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి గమనించిన స్థానికులు బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు పోకిరీల కోసం గాలింపు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News