: టీటీడీ సభ్యుడిగా రాఘవేంద్రరావు ప్రమాణస్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి సన్నిధిలోని బంగారువాకిలి ఎదుట రాఘవేంద్రరావుతో టీటీడీ ఈవో సాంబశివరావు ప్రమాణస్వీకారం చేయించారు. తరువాత ఆయన పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటానని దర్శకేంద్రుడు అన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు సేవలందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, సినీ నటుడు నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత భారవి పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.