: భూమి చదును కోసం అర్ధరాత్రి బ్లాస్టింగ్... ‘రియల్’ నిర్వాకంతో ఇద్దరు దుర్మరణం


భూమి చదును చేసే క్రమంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ నిబంధనలను అతిక్రమించింది. జనావాసాలకు సమీపంలో అర్ధరాత్రి బ్లాస్టింగ్ కు పాల్పడి ఇద్దరి దుర్మరణానికి కారణమైంది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం కంట్లాం పరిధిలో గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కంట్లాం రెవెన్యూ పంచాయతీ పరిధిలో భూమిని కొనుగోలు చేసిన భాష్యం డెవలపర్స్, సదరు భూమిని చదును చేసే క్రమంలో అక్కడి ఓ బండరాయిని తొలగించేందుకు బ్లాస్టింగ్ చేసింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పైడినాయుడు(42), అప్పలనాయుడు(58) అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News