: హన్మకొండ, నంద్యాల ఆర్టీసీ డిపోల్లో ఉద్రిక్తత... ప్రైవేట్, ఆర్టీసీ కార్మికుల మధ్య తోపులాట


ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులకూ తెర లేపుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడపాలని సంస్థ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో డ్రైవర్ కు రోజుకు రూ.1,000, కండక్టర్ కు రూ.800 ఇస్తామని, ఆసక్తి ఉన్న వారు ఆయా ప్రాంతాల్లోని డిపోల్లో సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లా హన్మకొండ ఆర్టీసీ డిపోకు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు. డ్రైవర్, కండక్టర్లుగా పనిచేస్తామని ఆర్టీసీ అధికారులను సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు ప్రైవేట్ వ్యక్తులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ కార్మికుడిపై ఆర్టీసీ కార్మికుడు చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా నంద్యాల బస్ డిపోలోనూ ఇదే తరహా గొడవ జరిగింది. తమను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులపై ప్రైవేట్ కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News