: హైదరాబాదు టూ ఆదిలాబాదు...టికెట్ ధర రూ.1,000: మొదలైన ‘ప్రైవేట్’ దోపిడీ!


తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె మొదలై రెండు గంటలు కూడా గడవలేదు. అప్పుడే ప్రైవేట్ ట్రావెల్స్ దోపీడీ జోరందుకుంది. వాస్తవ టికెట్ ధరకు మూడు రెట్లకు మించి వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు జనాన్ని దోచుకుంటున్నారు. హైదరాబాదులోని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేటకు వెళ్లాలంటే టికెట్ ధర రూ.80 మాత్రమే. అయితే ప్రైవేట్ ఆపరేటర్లు రూ.250 వసూలు చేస్తున్నారు. ఇక హైదరాబాదు నుంచి ఆదిలాబాదు వెళ్లాలంటే రూ.308లతో సూపర్ లగ్జరీ రకానికి చెందిన ఆర్టీసీ బస్సులో ఎంచక్కా వెళ్లిపోవచ్చు. అయితే జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ప్రైవేట్ ఆపరేటర్లు ఆదిలాబాదుకు రూ.1,000 వసూలు చేస్తున్నారు. మిగిలిన అన్ని రూట్లలోనూ ప్రైవేట్ ఆపరేటర్ల దందా మొదలైంది. అత్యవసరమైన పనులు ఉన్న వారు ధర మూడింతలకు పైగా ఉన్నా వెళ్లకతప్పడం లేదు.

  • Loading...

More Telugu News