: ఎంసెట్ అభ్యర్థుల చేతికి రిస్ట్ వాచీ కూడా ఉండొద్దు: టీ ఎంసెట్ కన్వీనర్
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు హాజరవుతున్నారా? అయితే, మీ చేతికి వాచీ ఉందో, లేదో చూసుకోండి. చేతికి వాచీ లేకపోతే పేచీ ఏమీ లేదు కానీ, వాచీ ఉంటేనే పేచీ. పేచీ లేకుండా ఉండాలంటే వాచీ లేకుండా వెళ్లాలట. మరి పరీక్షలో సమయం ఎలా తెలిసేది? అంటే, పరీక్షా కేంద్రాల్లోని అన్ని హాళ్లలో గోడ గడియారాలు (వాల్ క్లాక్)లు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణారావు చెబుతున్నారు. చేతి గడియారాల్లోనూ స్కానర్స్ వస్తున్న నేపథ్యంలోనే ఈ దఫా ఫరీక్షా కేంద్రాల్లోకి రిస్ట్ వాచీలను అనుమతించరాదని నిర్ణయించామని ఆయన చెబుతున్నారు. ఇక పదేపదే ఎంసెట్ రాసే అభ్యర్థులపైనా నిఘా పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొన్ని కార్పొరేట్ కళాశాలల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్న వారు పలుమార్లు ఎంసెట్ పరీక్షలు రాస్తున్నారన్న సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.