: కేపీసీసీ చీఫ్ పదవి రేసులో ఉన్నానంటున్న అంబరీష్!
కన్నడ చలనచిత్ర సీమలో అగ్రనటుడిగా ఎదిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన అంబరీష్, రాజకీయాల్లోనూ మెరుగ్గానే రాణిస్తున్నారు. ప్రస్తుతం సిద్ధరామయ్య కేబినెట్ లో హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్న అంబరీష్, తాజాగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) పదవిపై కన్నేశారు. ఈ పదవికి కావాల్సిన అన్ని అర్హతలు తనకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేపీసీసీ చీఫ్ పదవి రేసులో తాను ఉన్నానని కూడా ఆయన ప్రకటించారు. నిన్న కేపీసీసీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో భేటీ అయిన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.