: నేడు కర్నూలుకు జగన్... పత్తికొండలో కాంగ్రెస్ నేత నారాయణరెడ్డికి పార్టీ తీర్థం


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని డోన్, ప్యాపిలి, పత్తికొండల్లో జగన్ పర్యటిస్తారు. పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. అదే సమయంలో పత్తికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నారాయణరెడ్డి, వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. బహిరంగ సభలోనే నారాయణరెడ్డికి జగన్ తన పార్టీలోకి సాదర స్వాగతం పలకనున్నారు. నారాయణరెడ్డి కాంగ్రెస్ ను వీడనుండటంతో ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ దాదాపుగా ఖాళీ అయినట్లేనని చెప్పొచ్చు.

  • Loading...

More Telugu News