: అమెరికా చేరిన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు


తెలుగు రాష్ట్రాల రాజకీయాలు దేశ సరిహద్దులు దాటాయి. పెట్టుబడుల సేకరణకు వెళ్తున్నానంటూ నారా లోకేష్ అమెరికాలో అడుగుపెడితే, పలు కంపెనీలను పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షిస్తానని కేటీఆర్ బయల్దేరారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వస్తున్న నారా లోకేష్ కు అపాయింట్ మెంట్ ఇవ్వవద్దని అమెరికాలోని ఎన్నారైలు ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాకు బహిరంగ లేఖలు రాస్తుండడం వివాదం రేపుతోంది. ఈ లేఖలు రాసింది ఎవరై ఉంటారని టీడీపీ అభిమానులు అంతర్మధనంలో పడిపోయారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొడుకుగా తప్ప మరే అర్హతలేని లోకేష్ ను కలవడం అనవసరమని ఆ లేఖలలో ఎన్నారైలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తల నిధి సమన్వయకర్తగా ఉన్న లోకేష్ సేకరించిన డబ్బు నుంచి 10 వేల డాలర్లు చెల్లించి ఒబామాతో షేక్ హ్యాండ్ కొనుక్కుంటున్నారని ఆరోపించారు. దీంతో ఈ లేఖలను, టీఆర్ఎస్ లేక వైఎస్సార్సీపీ అభిమానులు రాసి ఉంటారని టీడీపీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News