: బీడీ కార్మికురాలి కుమార్తెకు కేసీఆర్ హామీ


ఇంటర్ బైపీసీలో 1000కి 991 మార్కులు తెచ్చుకున్న ఓ బాలిక పైచదువులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి పరిస్థితి వివరించింది. సుష్మ అనే ఈ అమ్మాయి ఓ బీడీ కార్మికురాలి కుమార్తె. తనకు వైద్య విద్య అభ్యసించాలని ఉందని సీఎంకు తెలిపింది. ఆ అమ్మాయి పరిస్థితి పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మెడిసన్ చదివేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో, ఆ చదువుల తల్లి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది.

  • Loading...

More Telugu News