: తన ఫోటోకు తానే లైక్ కొట్టి బుక్కయ్యాడు!


మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టిచ్చిన వారికి 2,500 డాలర్లు అంటూ పోలీసులు సామాజిక మాధ్యమంలో పెట్టిన ఫోటోకు లైక్ కొట్టి పట్టుబడ్డాడో ప్రబుద్ధుడు. అమెరికాలోని మోంటనా స్టేట్ లోని 'క్యాస్ కాడ్ కౌంటీ' ఏర్పాటు చేసిన 'క్రైమ్స్ టాపర్స్' ఫేస్ బుక్ పేజ్ లో లెవీ ఛార్లెస్ రేర్ డాన్ అనే వ్యక్తి ఫోటోను పోలీసులు పెట్టారు. వ్యాలెట్, చెక్ బుక్కుల దొంగతనం, ఫోర్జరీ వంటి కేసుల్లో నిందితుడైన రేర్ డాన్ ఫేస్ బుక్ పేజీలో కూడా ఇది దర్శనమిచ్చింది. అంతే, తన ఫోటో కనపడగానే రేర్ డాన్ లైక్ కొట్టుకున్నాడు. తన ఫోటోకు తానే లైక్ కొట్టినట్టు ఫేస్ బుక్ చూపించింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు, నెమ్మదిగా కూపీలాగి, అతగాడిని అరెస్టు చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. దీంతో ఫేస్ బుక్ ఎంత పని చేసింది! అంటూ రేర్ డాన్ తీరిగ్గా జైలులో బాధపడుతున్నాడు.

  • Loading...

More Telugu News