: బాబు గారూ, జగన్ గారూ! సమయం వచ్చింది...అడ్డం తిరగండి: శివాజీ పిలుపు


'ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారూ, ప్రతిపక్షనేత జగన్ గారూ! ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రానికి ఎదురు తిరగండి' అంటూ సినీ నటుడు శివాజీ పిలుపునిచ్చాడు. గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు. విభజన చట్టంలో చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసిందని ఆరోపించిన ఆయన, ప్రజలు పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశాడు. మనకెందుకులే అనుకుంటే రాష్ట్రం భ్రష్టుపట్టిపోతుందని శివాజీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్ కు కావాలనే ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని శివాజీ ఆరోపించాడు. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు నమ్మి, నిజాలు చెబుతున్నారని భ్రమపడి ఓట్లేశామని శివాజీ వెల్లడించాడు. పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఐదేళ్లు ప్రత్యకహోదా ఇస్తామని పేర్కొనగా, దానిని పదేళ్లకు పెంచాలని డిమాండ్ చేసింది బీజేపీ కాదా? అని ఆయన ప్రశ్నించాడు. మరి ప్రత్యేకహోదా ఇవ్వడంలో బీజేపీకి ఉన్న ఇబ్బంది ఏమిటి? అని శివాజీ నిలదీశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఐకమత్యం లేదని కేంద్రం భావిస్తోందని, దానిని తప్పని నిరూపించాల్సిన అవసరం ఉందని శివాజీ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News