: పోలీసులు, ఐఏఎస్ లతో శిక్షణ సిగ్గుచేటు: పొన్నం
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ శిబిరం నిర్వహించడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. రాజకీయ శిక్షణ శిబిరంలో ఐఏఎస్ లు, పోలీసు అధికారులతో బోధన తరగతులు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. అయినా, మూడు రోజుల శిక్షణతో టీఆర్ఎస్ పార్టీ నేతలకు పరిపూర్ణ జ్ఞానం వస్తుందా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మతిమరుపు రోగం ఉందని అన్నారు. మరో నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ శిక్షణ శిబిరంపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సామాన్యులకు అందుబాటులో ఉండడంలేదని విమర్శించారు.