: దేవుడ్ని దూషించాడని 25 ఏళ్ల జైలు, లక్ష జరిమానా


దేవుడ్ని దూషించాడని నిర్ధారిస్తూ 25 ఏళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించాలని సంచలన తీర్పు వెలువరించింది పాకిస్థాన్ లోని లాహోర్ సెషన్స్ న్యాయస్థానం. జుల్ఫికర్ అనే పాకిస్థానీ దైవాన్ని దూషించాడని ఆరోపిస్తూ 2006లో రేస్ కోర్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిని విచారించిన న్యాయస్థానం, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం పరిశీలించి అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. అలాగే అతని స్థిర, చరాస్తులు స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ లో దైవ దూషణ తీవ్రమైన నేరం. దైవ దూషణకు సంబంధించిన చట్టాలు కఠినంగా అమలవుతాయి. దీంతో, అతనికి కఠిన శిక్ష పడింది.

  • Loading...

More Telugu News