: ఇద్దరు సీఎంలు కూర్చుని పరిష్కరించాలి: కిషన్ రెడ్డి


అటల్ బిహారీ వాజ్ పేయికి, కాకుండా ఖాసీం రజ్వీ, వికారుద్దీన్ లకు భారత అత్యున్నత పురస్కారం ప్రదానం చేయాలా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మతోన్మాదాన్ని విరజమ్మే ఎంఐఎం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన ఒవైసీ ఎంపీ పదవిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తీవ్రవాద చర్యలను సమర్థించే మజ్లిస్ పార్టీ వ్యాఖ్యలు అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న సన్నని గీతను తెలంగాణ ప్రభుత్వం చెరిపేస్తోందని, అది సరికాదని ఆయన హితవు పలికారు. ఆర్టీసీ సమ్మెపై సీఎం కలుగచేసుకుని రవాణా వ్యవస్థకు ఆటంకం కలుగకుండా చూడాలని ఆయన సూచించారు. హైకోర్టు విభజన గురించి గవర్నర్, ఇరు రాష్ట్రాల సీఎంలు, ఛీఫ్ జస్టిస్ కలిసి కూర్చుని చర్చించి, పరిష్కరించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News