: మా పొలాల్లో మిషన్ కాకతీయ పనులు వద్దు... హైకోర్టుకు వెళ్లిన రంగారెడ్డి జిల్లా రైతులు


మిషన్ కాకతీయ పనులను వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలంలోని అవుశాపూర్ గ్రామ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. బాలనర్సింహ, లక్ష్మయ్య, కొట్టి సునీల్ రెడ్డి, రాజేశ్వరి, నరేందర్ రెడ్డి, ఎం.శ్రీవాణి, ఎం.కృష్ణలు ఈ మేరకు పిటిషన్ లు దాఖలు చేశారు. గ్రామంలోని రాంచెరువులో కొంత భాగం... అంటే సర్వే నంబర్లు 173 నుంచి 182, 187 వరకు తమ భూములు ఉన్నాయని, వాటిలో ప్రతి ఏడాది పంటలు సాగు చేస్తున్నామన్నారు. ఇప్పుడు మిషన్ కాకతీయ పనులవల్ల తమ పోలాల్లో మట్టిని తవ్వి గుంతగా మారిస్తే వానాకాలంలో నీరు నిలిచి చెరువుగా మారుతుందంటున్నారు. ఆ పొలాలే తమకు ఆధారమని, పొలాలను చెరువుగా మారిస్తే ప్రత్యామ్నాయం ఏంటని అడుగుతున్నారు.

  • Loading...

More Telugu News